
ఎస్సారెస్పీలోకి స్వల్ప ఇన్‌ఫ్లో
బాల్కొండ: స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి స్వల్ప ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌లోకి 2,078 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, ఆవిరి రూపంలో 277, తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1068.6(21.02 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
అధ్యాపక పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల/కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గణితం(2), బోటనీ(2) జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెస్సీ, బీఈడీ విద్యార్హత కలిగి, బోధనలో మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలోపు నాగారంలోని మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో సమర్పించాలన్నారు. మిగతా వివరాలకు 98494 19469 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పెంపు
నిజామాబాద్‌అర్బన్: ఉపకార వేతనాల కోసం దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి రజిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నూతన ఉపకార వేతనాలు, రెన్యువల్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
బాలికల కళాశాల తనిఖీ
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను డీఐఈవో రవికుమార్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో తరగతుల ని ర్వహణ, అధ్యాపకుల పనితీరును స్వయంగా పరిశీలించారు. జిల్లాలోనే అత్యధికంగా అడ్మిషన్లను చేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థులు వందశాతం ఫలితాలు సా ధించేందుకు ప్రణాళికాబద్ధంగా ఇప్పటి నుంచే అన్ని సబ్జెక్ట్‌ల అధ్యాపకులు సమన్వయంతో పని చేయాలన్నారు. నాన్ టీచింగ్ సిబ్బంది అడ్మిషన్‌ల పనిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్ర ఆర్థిక సంఘం
చైర్మన్‌ను కలిసిన సీపీ
ఖలీల్‌వాడి: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను సీపీ సాయిచైతన్య మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో రాజయ్యకు పుష్పగుచ్ఛం అందజేశారు.

ఎస్సారెస్పీలోకి స్వల్ప ఇన్‌ఫ్లో