
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన ఒడ్డెపల్లి రంజిత్ (29) బైక్‌పై అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడి మృతి చెందినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ సోమవారం తెలిపారు. ఒడ్డెపల్లి రాజలింగంకు నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కూతురుతోపాటు ఇద్దరు కొడుకులకు గతంలోనే పెళ్లిళ్లు జరిగాయి. మూడో వాడైన రంజిత్ 5 సంవత్సరాలుగా దుబాయ్‌కు వెళుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని వారం రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం బైక్‌పై బయటికి వెళ్లాడు. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తూ గ్రామంలోని సీసీ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో కుటుంబీకులు రంజిత్‌ను డిచ్‌పల్లిలోని ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడి తండ్రి రాజలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.