
కాన్వొకేషన్‌కు రండి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించనున్న కాన్వొకేషన్‌కు హాజరుకావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు ఆహ్వానించారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లిన వీసీ, సీపీని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
సుభాష్‌నగర్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనున్నట్లు ఏడీఈ టౌన్–1 ఆర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక్‌నగర్‌లో 33కేవీ కొత్త టవర్ నిర్మాణం కోసం కరెంట్ కోత విధించనున్నట్లు తెలిపారు. దీంతో మహాలక్ష్మీ ఫీడర్ పరిధిలోని అమ్మ వెంచర్, న్యూ హౌసింగ్ బోర్డు, ఆర్యనగర్ (కొంతభాగం), ఎల్‌జీ స్విమ్మింగ్ పూ ల్, బ్యాంకు కాలనీ, బస్వా గార్డెన్, తుల్జా భవానీ, గూడెం ప్రాంతాల్లో నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అన్నారు.