
పకడ్బందీగా ఓటరు నమోదు చేయాలి
రుద్రూర్: ఓటర్ నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత కార్యాలయ భవనంలో సోమవారం చందూర్, రుద్రూర్ బీఎల్‌వోలతో నిర్వహించిన శిక్షణను పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు వివరాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. తప్పులు సరిచేయడంతోపాటు డబుల్ ఓట్లను తొలగించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేందర్ నాయక్, చందూర్ ఉప తహసీల్దార్ ఆసియా ఫాతిమా, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
బాన్సువాడ
సబ్ కలెక్టర్ కిరణ్మయి