
జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించేనా?
నిజామాబాద్‌నాగారం: పదవీ విరమణ వయస్సు లో కొత్త బాధ్యతలు ఎందుకు..? ఉన్నపళంగా హై దరాబాద్‌ను వదిలి వేరే జిల్లాకు వదిలి వెళ్లడం ఎందుకు? అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా మాల కొండారెడ్డి ఇప్పటికీ విధుల్లో చేరలేదు. అసలు ఆయన వస్తా రా? రారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్ర జనరల్ ఆస్పత్రికి సూపరింటెండెంట్‌గా మాల కొండారెడ్డిని ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి విముఖత చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పదవీ విరమణ వయస్సు, హైదరాబాద్‌ను వదిలి వెళ్లడం ఇష్టం లేని ఆయన కోర్టుకు వెళ్లినట్లు తెలిసింది.
ఏళ్లుగా ఇన్‌చార్జీలే..
ప్రభుత్వం ఆదేశించినా మాల కొండారెడ్డి విధుల్లో చేరకపోవడంతో జీజీహెచ్‌కు మళ్లీ ఇన్‌చార్జి పాలనకే దిక్కయ్యేలా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. గత 12 ఏళ్లలో డాక్టర్ వాలీయాను మా త్రమే ప్రభుత్వం సూపరింటెండెంట్‌గా నియమించినా ఆయన ఇటువైపు కన్నెత్తి చూడలేదు. జిల్లా ఆస్పత్రి జీజీహెచ్‌గా మారిన నాటి నుంచి ఇన్‌చార్జీలతోనే నెట్టకొస్తున్నారు. దూరం కారణంగా సూపరింటెండెంట్‌లుగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేందుకు భయపడుతున్నారని, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో పోస్టింగ్‌లను ఇష్టపడుతున్నారని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించడం కత్తి మీద సాము అని, దీంతో రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా జిల్లాకు రావడానికి భయపడుతున్నారని పలువురు అంటున్నారు.
ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినా
ఇప్పటికీ విధుల్లో చేరని వైనం
పెద్ద దవాఖానాకు రెగ్యులర్
సూపరింటెండెంట్ రాక కలేనా..
12 ఏళ్లుగా ఇన్‌చార్జీల పాలనే దిక్కు
సెలవుల్లో ఇన్‌చార్జి సూపరింటెండెంట్
జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ వ్యక్తిగత పనుల నిమిత్తం 10 రోజులు సెల వులో వెళ్లారు. ఆర్థో ప్రొఫెసర్ డాక్టర్ రాములు ఇన్‌చార్జిగా కొనసాగనున్నారు.