
అన్నారంలో కారు బోల్తా
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం అన్నారం శివారులో ఆదివారం రాత్రి మారుతి స్విఫ్ట్ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. నిజామాబాద్‌కు చెందిన యువకులు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అతి వేగంతో కారును నడపడంతో మూలమలుపు వద్ద రోడ్డు కనిపించక కారు వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అందులో ఉన్న యువకులకు స్వల్పగాయాలు కాగా, పొక్లెయిన్ సాయంతో కారును బయటికి తీశారు. అన్నారం వద్ద మూల మలుపు కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. టిప్పర్లు, ఆటోలు బోల్తా పడిన ఘటనలున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టకపోవడంతో పలువురు వాహనాలను అతివేగంగా నడుపుతున్నారు.