
ఎస్పీ నుంచి సీపీగా జిల్లా పోలీస్ బాస్
మీకు తెలుసా?
రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో దసరా రోజున ప్రారంభించిన కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతో పాటు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది.●
● నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాను మెరుగ్గా నిర్వహించడానికి, శాంతిభద్రతల సంక్లిష్టతను పరిష్కరించడానికి నిజామాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)ను, కమిషనర్ ఆఫ్ పోలీస్ (CP)గా అప్‌గ్రేడ్ చేశారు.
● సీపీ నేరుగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కి నివేదిస్తుంది, నిర్ణయం తీసుకోవడాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఒక కమిషనరేట్ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ట్రాఫిక్, శాంతిభద్రతలు, నేర శాఖలు వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయవచ్చు.
● సీపీ మార్పుతో జిల్లాలోని పోలీసు అధికారుల హోదాల్లో మార్పు వచ్చింది. జిల్లా పోలీస్ బాస్‌ను సూపరింటెడెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ)గా మార్పు చేశారు.
● జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డీఎస్పీల హోదాల్లో సైతం మార్పు వచ్చింది. నాటి నుంచి నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే డీఎస్పీలను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా పిలవడం ప్రారంభించారు.
● జిల్లాలో అదనంగా మెండోర, ముప్కాల్, ఏర్గట్ల, ఆలూర్, డొంకేశ్వర్ పోలీస్ స్టేషన్లు చేర్చబడ్డాయి. సిరికొండ పోలీస్ స్టేషన్‌ను ధర్పల్లి సర్కిల్‌లో విలీనం చేసి నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోకి తీసుకున్నారు.
– ఆర్మూర్