
అట్టహాసంగా బోనాల పండుగ
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలతోపాటు అధికారులు బోనమెత్తి అమ్మవారిని కొలిచారు. వేడుకల్లో ఆయా శాఖల మహిళ ఉద్యోగులు బోనాలతో హాజరయ్యారు. బోనాల ఊరేగింపులో నాని యాదవ్ మాతంగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారి బోనంతో విన్యాసాలు చేస్తూ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు క్షేమంగా ఉండాలని, అమ్మదయ అందరిపై ఉండాలని కోరారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్, రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు నరసింహరెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుమన్, శేఖర్, అసోసియేట్ ప్రెసిడెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా బోనాల పండుగ