
దేశానికి గర్వకారణం
భరతమాత కీర్తిని మరింత పెంచేవిధంగా శుభాంశు శుక్లా చేసిన ఈ అంతరిక్ష యాత్ర విజయవతం కా వ డం మనందరికీ గర్వకారణం. భారతీయ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో అనేక విజ్ఞానదాయకమైన అంశాలున్నాయి. వీటి ఆధారంగా అనేక పరిశోధనలు చేసి ధన్వంతరి, శుశ్రుతుడు, పతంజలి, వాగ్భటులు, చరకుడు, చాణ క్యుడు, ఆర్యభట్ట లాంటి భారతీ య మునులు, శాస్త్రవేత్తలు, శ్రీనివాస రామాను జన్, సీవీ రామన్, శకుంతలాదేవి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జగదీష్ చంద్ర బోస్, హోమీబాబా, సతీష్ ధావన్, నంబినారాయణన్ లాంటి వారు అందించిన విజ్ఞానాన్ని గురించి ప్రతి విద్యార్థి తెలు సుకోవాలి. వీళ్లందరి స్ఫూర్తితో, తాజాగా శుభాంశు శుక్లాను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు అకుంఠిత దీక్షతో చదివి దేశానికి ఉపయోగపడే భావి భారత పౌరులుగా ఎదగాలి. దేశ కీర్తిని సగర్వంగా చాటే లక్ష్యంతో ముందుకెళ్లాలి.
– మోతుకూరి రేణుక, హిందీ పండిత్