
ఇసుక క్వారీ పనుల అడ్డగింత
రుద్రూర్: పోతంగల్ మండలం సుంకిని శివారులో ని మంజీరా నదిలో ఇసుక క్వారీ ఏర్పాటు పనులను మంగళవారం స్థానిక రైతులు అడ్డుకున్నారు. గత వారం రోజులుగా కొందరు వ్యక్తులు తమకు క్వారీ ఏర్పాటుకు అనుమతి లభించిందని పేర్కొంటూ ర్యాంపు పనులు ప్రారంభించారు. ఇసుక ర్యాంపు ఏర్పాటు పట్ల స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్వారీ ఏర్పాటు చేస్తే మంజీర తీరప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకాలు వట్టి పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ నిర్వహణ గూర్చి రెవె న్యూ అధికారులకు, స్థానికులకు కూడా ఎలాంటి సమాచారం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను నిలిపివేయాలని నినాదాలు చేశారు. అ నుమతులు లేకుండా ఇసుక క్వారీ కోసం ఏర్పాట్లు చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ గంగాధర్ ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. మూడు టిప్పర్లను సీజ్ చేసీ కోటగిరి పోలీస్ స్టేషన్ తరలించారు.