
న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
నిజామాబాద్ నాగారం: నగరంలోని ఐడీఓసీలో మంగళవారం క్షయ వ్యాధిగ్రస్తులకు డీఎంహెచ్‌వో రాజ్యశ్రీ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా రాజ్యశ్రీ మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం నిమిత్తం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయడం చాలా హర్షించదగ్గ విషయమని రెడ్ క్రాస్ సభ్యులను అభినందించారు. రెడ్‌క్రాస్ చైర్మన్ బుస ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపే రవీందర్, డాక్టర్ సుప్రియ, ఘన్పూర్ వెంకటేశ్వర్లు, శ్యామల, నాగరాజు, తదితరులున్నారు.
రౌడీషీటర్ అరెస్ట్
ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఆటో డ్రైవర్‌ను కొట్టి కత్తులతో బెదిరించి రూ. 400 ఎత్తుకెళ్లిన కేసులో ప్రధాన నిందితుడు రౌడీషీటర్ బర్సాత్ ఆమీర్‌తోపాటు షాబాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి మంగళవారం తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి, రిమాండ్ చేశారు. రౌడీషీటర్లు బెదిరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.