
యోగాతోనే గుర్తింపు వచ్చింది..
మాది భీంగల్. నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పటి నుంచి మా స్కూల్లో యోగాభ్యాసం నేర్చుకోవడం ప్రారంభించాను. రెండుసార్లు డిస్ట్రిక్ లెవల్ యోగా పోటీల్లో పాల్గొనగా, రెండుసార్లు పతకాలు వచ్చాయి. స్టేట్ లెవల్‌లో ఒకసారి పతకం వచ్చింది. నేషనల్ లెవెల్లో రెండుసార్లు పాల్గొన్నాను. ఇటీవల జరిగిన జాతీయస్థాయి యోగా పోటీలలో తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించాను. మా గ్రామంలో యోగాతోనే నాకు గుర్తింపు వచ్చింది.
– వర్షిత్, భీంగల్
పదహారేళ్లుగా యోగా..
16 ఏళ్లుగా నేను యోగా చేస్తున్నాను. చుట్టుపక్కల గ్రామాల్లో ఆసక్తి ఉన్నవారికి కూడా యోగా నేర్పించడమే కాకుండా యోగా వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాను. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక శారీరక, మానసిక రుగ్మతలకు యోగా చక్కటి పరిష్కారం. ఈ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా యోగాకి ఆదరణ పెరుగుతుంది. జబ్బుల బారిన పడకముందే యోగా చేయడం అలవాటు చేసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి.
– మాలవత్ బాబురావు, నిజామాబాద్
యోగా పోటీల్లో ప్రతిభ..
నేను పాఠశాలలో యోగా చేయడం నేర్చుకు న్నాను. ఎక్కడ యోగా పోటీలు జరిగినా పాల్గొ ని పతకం సాధించాను. జిల్లా, రాష్ట్రస్థాయిలో పతకాలు వచ్చాయి. జాతీయస్థాయిలో సైతం ప్రతిభతో సత్తా చాటాను. సీఎం కప్‌లో పాల్గొని రాష్ట్రస్థాయిలో రాణించాను. యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు పతకాలు సాధిస్తున్నాను.
– వర్షిత, డిగ్రీ, నిజామాబాద్

యోగాతోనే గుర్తింపు వచ్చింది..

యోగాతోనే గుర్తింపు వచ్చింది..