ప్రకృతి ప్రేమికుల విందు
నిజామాబాద్ రూరల్ : రావి ఆకులపై ఆ హ్వానపత్రిక.. అతిథులకు స్వాగతం పలుకుతూ ఫంక్షన్ హాల్ బయట సహజ రంగుతో బట్టపై రూపొందించిన ‘ప్రత్యేక ఆహ్వానం’.. వచ్చి న అతిథులు మంచి నీరు సేవించేందుకు జొన్నపంట వ్యర్థాలతో తయారు చేసిన గ్లాస్‌లు.. ఆకులతో స్వీట్‌కప్పులు, కట్టె స్పూన్‌లు.. బాస్మతి బియ్యంతో బిర్యానీ, గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన దేశీ రకం చిట్టిముత్యాలతో పుదీనా రైస్, కుల్లకర్ బియ్యం, తామరపూల గింజల కూర్మా, దోసకాయ రోటీ పచ్చడి, మామిడికాయ పప్పు, పు ట్టగొడుగుల కర్రీ, గుత్తి వంకాయ, మసాల కారం, సాంబారు, నవార రైస్‌తో పెరుగన్నం, మిర్యాల చా రు వీటన్నింటిని తనివితీరా ఆరగించిన తరువాత స్వీట్లు, బెల్లం, మిర్యాలు, సోంప్‌తో తయారు చేసిన బెల్లం పానకం, కాజు, బాదాంలతో తయారు చేసిన ఆర్గానిక్ స్వీట్. వింటేనే నోరూరుతోంది.. తింటే ఆ సంతృప్తే వేరు. ప్రకృతి వంటకాలకు నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్ వేదికై ంది. నగరానికి చెందిన గణపత్రి విజయ్, కీర్తన దంపతులు తమ కుమార్తె సహస్ర నూతన వస్త్రాలంకరణ విందుకు 500 మంది అతిథులను ఆహ్వానించి వారందరికీ ప్రకృతి సిద్ధమైన భోజనం వడ్డించి ఆదర్శంగా నిలిచారు. పర్యావరణ ప్రేమికుడైన విజయ్ గానుగ నూనె వ్యాపారం చేస్తున్నారు.
ప్రకృతి ప్రేమికుల విందు
ప్రకృతి ప్రేమికుల విందు
ప్రకృతి ప్రేమికుల విందు


