
అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 117 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్లతోపాటు జడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఇన్‌చార్జి ఆర్డీవో స్రవంతిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అధికారులను ఆదేశించారు.
అందాల పోటీలు రద్దు చేయాలి
హైదరాబాద్‌లో నిర్వహించే మిస్‌వరల్డ్ 72వ పోటీలను రద్దు చేయాలని పీవోడబ్ల్యూ, ఐద్వా ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు ప్రజావాణిలో విన్నవించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. సీ్త్ర ఆత్మగౌరవాన్ని భంగపరిచేలా ఉన్న ఈ పోటీలను నిర్వహించొద్దన్నారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ కార్యదర్శి సంధ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, అరుణ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజు, అనిత, లక్ష్మి, సంజన, అమూల్య, మంజుల, కీర్తి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్లు అంకిత్,
కిరణ్‌కుమార్
ప్రజావాణికి 117 ఫిర్యాదులు
గృహజ్యోతి అమలు కావడం లేదు
నాకు గృహజ్యోతి పథకం అమలు కావడం లేదు. ప్రతి నెలా 200 యూనిట్ల కంటే తక్కువగానే విద్యుత్ వినియోగిస్తున్నాను. గృహజ్యోతి కోసం అధికారులకు విన్నవించినా అధికారులు స్పందించడం లేదు.
– బాదావత్ గంగారాం, మద్దెపల్లి

అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు