
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నిజామాబాద్ అర్బన్/ మోపాల్ : నగరంలోని వర్ని రోడ్ శ్రీ పద్మశాలి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. పదో తరగతి 2005–2006 బ్యాచ్ విద్యా ర్థులు గురువులను ఘనంగా సన్మానించారు. మో పాల్ మండలంలోని బాడ్సి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009–10లో పదోతరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్ర మం ఘనంగా నిర్వహించారు. 15 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆత్మీ యంగా పలుకరించుకొని, తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటాపాటలతో రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు వీడియో కాల్స్ ద్వారా ఈ వేడుకలో పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం