కేంద్రం నుంచి నిధుల కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

కేంద్రం నుంచి నిధుల కొరత లేదు

Oct 16 2024 1:04 AM | Updated on Oct 16 2024 1:04 AM

కేంద్రం నుంచి నిధుల కొరత లేదు

కేంద్రం నుంచి నిధుల కొరత లేదు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ) పనులకు కేంద్రం నుంచి నిధుల కొరత లేదని, అన్ని పనులకు ముందస్తుగానే నిధులు డి పాజిట్‌ చేయడం జరిగిందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వమే నిధు ల విడుదలలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అడవిమామిడిపల్లి వద్ద చేపట్టిన పనులకు రూ.23.6 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా, ఇంత వరకు ఇవ్వలేదని, అయినప్పటికీ కాంట్రాక్టర్‌ పనులు పూ ర్తి చేస్తున్నారన్నారు. అర్సపల్లి ఆర్‌వోబీకి 3.5 ఎకరాల భూమిని క్లియరెన్స్‌ చేయాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నవంబర్‌ 2 వర కు ఆర్మూర్‌, అడవి మామిడిపల్లి వద్ద అప్రోచ్‌ రో డ్డు పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారన్నా రు. వచ్చే ఏడాది జూన్‌ వరకు మాధవనగర్‌ ఆర్‌వో బీ పనులు పూర్తి చేస్తామన్నారు. ఆర్‌వోబీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇ చ్చి నిధులు మంజూరు చేయలన్నారు. పీసీసీ అధ్య క్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ కార్పొరేటర్‌గా గెలువకు న్నా విమర్శలు చేయడం సరికాదన్నారు. తన హ యాంలో రైల్వే ఆర్‌వోబీలు, పసుపుబోర్డు, మద్దతు ధర వంటి అనేక పనులు పూర్తయ్యాయన్నారు. జి ల్లాకు ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలను తీసుకురావడంలో ఇక్కడి పాలకులు విఫలమయ్యారన్నారు. ఖమ్మం, నల్గొండకే అభివృద్ధి పనులు వెళ్తున్నాయని, జిల్లా నాయకులు ఏం చేస్తున్నట్లని విమర్శించారు.

పనులు పూర్తి చేయాలి

ఆర్వోబీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ అర్వింద్‌ ఆదేశించారు. మంగళవారం కలె క్టర్‌ చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీ క్ష నిర్వహించారు. అడవిమామిడిపల్లి ఆర్‌వోబీ పనులకు సంబంధించి నిధుల కేటాయింపుపై సమీక్షించారు. ట్రాఫిక్‌ మళ్లింపు చేపడితే అప్రో చ్‌ పనులను పూర్తి చేస్తామని సంబంధిత కాంట్రాక్టర్‌ తెలుపగా, ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టాలని కలెక్టర్‌ను ఎంపీ ఆదేశించారు. మాధవనగర్‌ పనులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని ఎంపీ ఆదేశించారు. అర్సపల్లి ఆర్‌వోబీ పనులకు సంబంధించి మూడున్నర ఎకరాల స్థలం అప్పగించాలన్నారు. పనులపై సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఎంపీ కలెక్టర్‌కు సూచించారు. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement