నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

9లోu శుక్రవారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

త్యాగధనుల పోరుఫలం తెలంగాణ హామీలు నెరవేర్చడమే..ప్రజాప్రభుత్వం లక్ష్యం ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం జిల్లాకేంద్రంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

గణితం భయంపై అధ్యయనం.. నిర్మల్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయి గుర్తింపు

నాలుగు రోజులుగా భానుడి ప్రతాపం నేలరాలుతున్న పిందెలు, కాయలు ఆందోళనలో రైతులు

అప్రమత్తతే ప్రధానం

గణేశ్‌ నిమజ్జన ఉత్సవాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సంగారెడ్డి ఘటన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.

ప్రజల ఐక్యతతోనే అభివృద్ధి

నిర్మల్‌టౌన్‌: రాష్ట్రప్రజల ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవ డం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రాష్ట్ర సా ధన కోసం కేసీఆర్‌ నాయకత్వంలో సాగిన ఉద్యమాన్ని గుర్తుచేశారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, బీఆర్‌ఎస్‌ ని ర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాంకిషన్‌రెడ్డి, ఖానాపూర్‌ ఇన్‌చార్జి జాన్సన్‌ నాయక్‌, నా యకులు మరుగొండ రాము, భూషణ్‌రెడ్డి, డాక్టర్‌ సుభాష్‌రావు, మహేశ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జెండా

ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం

నిర్మల్‌: ఎంతోమంది వీరులు, సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలమే తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రాన్ని తీసుకువచ్చిందని, వారి పోరాటస్ఫూర్తితో ప్రజాసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, ఎస్పీ జానకీషర్మిల తదితరులతో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వ విప్‌ తన సందేశంలో వివరించారు.

విద్య, వైద్యం..

జిల్లాప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో అధునాతన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 14,131 శస్త్రచికిత్సలు చేసి, రూ.45కోట్ల 25లక్షల విలువైన వైద్యసేవలు అందించామన్నారు. జిల్లాలో 628 పాఠశాలల్లో రూ.20 కోట్ల 65 లక్షలతో మౌలిక వసతుల పనులు మంజూరు చేశామన్నారు. పదోతరగతి ఫలితాల్లో జిల్లా 98. 96 శాతంతో రాష్ట్రంలో మూడోస్థానంలో నిలిచిందన్నారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం పది నూతన భవిత భవనాలు నిర్మిస్తుండగా, 689 పాఠశాలల శానిటరీ సిబ్బందికి నెలకు రూ.36 లక్షల చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు.

వ్యవ‘సాయం’..

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. రైతుభరోసా పథకం కింద లక్షా 89వేల924మంది రైతులకు రూ.267కోట్ల 96లక్షల పంట పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమచేశామన్నారు. ఉద్యాన, పట్టు పరిశ్రమరంగంలో రైతులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. 2026–27లో 488 మంది రైతులకు ఆయిల్‌పామ్‌ సాగుకోసం రూ.కోటి 81లక్షలు, 224మంది రైతులకు సూక్ష్మ సేద్యం కోసం రూ.కోటి 62 లక్షలు మంజూరు చేశామన్నారు.

అన్నివర్గాల సంక్షేమం కోసం..

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నివర్గాల సంక్షేమం కోసం ఆయా శాఖల ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తోందని వీరేశం వివరించారు. యువజన సర్వీసుల ద్వారా క్రీడల అభివృద్ధి తోడ్పాటునందిస్తుందని చెప్పారు. మహిళా శిశుసంక్షేమం కోసం అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖ పకడ్బందీగా చర్యలు చేపడుతోందన్నారు. రోడ్డుప్రమాదాలు, గంజాయి నిర్మూలన, మహిళల భద్రతకు ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు.

ప్రశంసాపత్రాలతో విద్యార్థులు, ప్రిన్సిపాల్‌,

ప్రాజెక్ట్‌ గైడ్‌ తదితరులు

పుష్కరాలు.. బాసర అభివృద్ధి..

గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించడంతో పాటు, బాసర ఆలయ అభివృద్ధికి రాష్ట్రం నిధులు విడుదల చేసిందని, పనులు కూడా వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఆలయ పునర్‌ నిర్మాణం కోసం రూ.354 కే టాయించినట్లు తెలిపారు. ప్రజాపాలన ఉత్సవంలో అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఎఫ్‌ ఓ సుశాంత్‌ సుఖ్‌దేవ్‌ బోబడే, డీఆర్‌వో రాథో డ్‌ రమేశ్‌, శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామీణాభివృద్ధిలో..

వీబీజీ రాంజీ పథకంలో 92 శాతం పని దినాల సాధనతో రాష్ట్రంలో ప్రథమస్థానం సాధించామన్నారు. బ్యాంకు రుణాల వసూళ్లలో వందశాతం ప్రగతితో రాష్ట్రంలో ప్రథమస్థానం సాధించడం ప్రశంసనీయమన్నారు. జిల్లాలో 1,659 ఫామ్‌పాండ్లను తవ్వించామన్నారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధి, పారిశుద్ధానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

సొంతింటి కల..

పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. జిల్లాలో 9,268 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 3,150ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే రూ.171కోట్ల 20లక్షలు విడుదల చేశామన్నారు. రెండోదశలో నియోజకవర్గానికి రెండువేల ఇళ్ల చొప్పున కేటాయించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement