నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. గత ఎనిమిది నెలలకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.4,19,719 సమకూరినట్లు ఇన్‌చార్జి ఈవో భూమయ్య, ఇన్‌స్పెక్టర్ రంగు రవికిషన్‌న్‌గౌడ్ తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, ధర్మకర్తలు దేవేందర్‌గౌడ్, ముడారపు గంగాధర్, ఆలయ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టారు.


