వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

వాతావరణం

ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీస్తాయి.

అమరవీరుల త్యాగాలు స్మరించుకోవాలి

బాసర: ప్రతి ఒక్కరూ అమరవీరుల త్యాగాలు స్మరించుకోవాలని వీసీ ప్రొఫెసర్‌ ఏ.గోవర్ధన్‌ పేర్కొన్నారు. ఆర్జీయూకేటీలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్‌ ఏ.గోవర్ధన్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. అధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు జాతీయ, రాష్ట్ర గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సీనియర్‌ ఫ్యాకల్టీ సాగర్‌, అసోసియేట్‌ డీన్లు డాక్టర్‌ ఎస్‌. విట్టల్‌, శీలం శేఖర్‌, డీఎస్పీ ఎం.వెంకట్‌, డాక్టర్‌ బి. విజయ్‌కుమార్‌, డాక్టర్‌ దేవరాజు, స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి ఫ్యాకల్టీ ఎం. రామకృష్ణ, పీడీలు శ్యాంబాబు, రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

రేపు జిల్లాస్థాయి జూడో ఎంపిక పోటీలు

నిర్మల్‌టౌన్‌: జిల్లా జూడో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సిర్గాపూర్‌లోని ప్లేయర్‌ హైస్కూల్‌లో శనివారం జిల్లాస్థాయి జూడో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజన్న, ఎస్జీఎఫ్‌ సెక్రెటరీ రాథోడ్‌ లక్ష్మణ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అండర్‌–14, 17, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు ఈ పోటీలు ఉంటాయని వివరించారు. పోటీల్లో పాల్గొనేవారు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8555836057 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement