కర్ర వినాయకునికి పూజలు | - | Sakshi
Sakshi News home page

కర్ర వినాయకునికి పూజలు

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

తానూరు: మండలంలోని భోసిలో నెలకొల్పిన కోర్కెలు తీర్చే కర్రవినాయకుని దర్శించుకునేందుకు గురువారం భక్తులు బారులు తీరారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కోర్కెలు తీర్చాలని ముడుపులు చెల్లించుకున్నారు. అలాగే ఆయా గ్రామాల నుంచి భక్తులు పాదయాత్రగా చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు.

దర్శించుకున్న దత్తపీఠ స్వామి

మహారాష్ట్రలోని పింపల్‌గావ్‌ దత్తపీఠ స్వామిశ్రీ తపస్వి బాలయోగి వెంకటస్వామి మహారాజ్‌ గురువారం మధ్యాహ్నం భోసి గ్రామంలోని కర్రవినాయకుని దర్శించుకున్నారు. భక్తులు ఆయనకు స్వాగతం పలికి పూలు చల్లారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గ్రామస్తుల ఐక్యత ఒకే విగ్రహం ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలు చాటుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉత్తం బాలేరావ్‌, కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement