నిర్మల్ రూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. నిర్మల్ మండలంలోని కౌట్ల (కె) గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించా రు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారు మూ డ నాగవ్వ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నా రు. అధికారులతో కలిసి ఇంటిని పరిశీలించారు. ఆ యన మాట్లాడుతూ.. గుడిసెలు లేని రాష్ట్రంగా తె లంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పే ర్కొన్నారు. అంతకుముందు గ్రామ శివారులోని డ బుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందేలా చర్యలు తీ సుకుంటామని వివరించారు. సొంత స్థలాలున్న ఇ ళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామంలో నిర్మిస్తున్న ఫామ్‌పాండ్‌ను పరిశీలించారు. రైతులంతా ఫామ్‌పాండ్‌ల నిర్మాణాలకు ముందుకురావాలని సూచించారు. అ దనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ శ్రీని వాస్‌రెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ఎంపీడీవో సుధాకర్, సర్పంచ్ దు మాల రాజు, ఉపసర్పంచ్ రఘు తదితరులున్నారు.


