ఉపసర్పంచులకు గౌరవవేతనం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఉపసర్పంచులకు గౌరవవేతనం ఇవ్వాలి

Jul 29 2026 12:22 AM | Updated on Jul 29 2026 12:22 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: ఉపసర్పంచులకు గౌరవవేతనం ఇ వ్వాలని ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పొ ద్దుటూరి సంపత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ఉపసర్పంచులు నిరసన తెలిపారు. అనంతరం సంపత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపసర్పంచులకు గౌరవ వే తనం నెలకు రూ.5వేలు, వార్డు మెంబర్లకు రూ.3 వేల చొప్పున ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గ్రా మపంచాయతీ తీర్మాన పత్రాలపై ఉపసర్పంచుల కు కూడా సంతకం చేసే హక్కు కల్పించాలని కోరా రు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకా లపై ఉపసర్పంచుల పేర్లు ముద్రించాలని, మండల స్థాయిలో జరిగే సర్వసభ్య సమావేశాలకు ఉపసర్పంచులను ఆహ్వానించాలని, గ్రామపంచాయతీ స్టాండింగ్‌ కమిటీల్లో సర్పంచ్‌ చైర్మన్‌గా ఉంటే, ఉపసర్పంచ్‌ను వైస్‌చైర్మన్‌గా గుర్తించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement