నిర్మల్‌చైన్‌గేట్: అరెస్ట్‌లతో విద్యార్థులు, రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుకోలేరని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా, ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా ఆందోళన ని ర్వహించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహు ల్ గాంధీ అరెస్ట్, విచక్షణారహితంగా విద్యార్థులపై లాఠీచార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయ డం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నీట్ పరీక్షల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.


