మెరుగైన వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వసతులు కల్పించాలి

Jul 23 2026 1:36 AM | Updated on Jul 23 2026 1:36 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన వసతులు క ల్పించడమే లక్ష్యమని బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మె ల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బుధవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీ) బాలుర పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. బోధన, వసతులు, పరిశుభ్రత, తాగునీ రు, వంటశాల, ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వసతిగృహంలో ని ఒకే గదిలో 25 మంది ఉండాల్సి వస్తోందని వి ద్యార్థులు తెలుపగా, శాశ్వత భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌ రాథోడ్‌, ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్‌, కౌన్సిలర్లు గంజి రాజు, శశాంక్‌, సూరి, అర్జున్‌, సా త్విక్‌, విఠల్‌, నరేశ్‌, నాయకులు సాగర్‌, జమాల్‌, నారాయణగౌడ్‌, హరీశ్‌, భరత్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement