లక్ష్మణచాంద: రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ సూచించారు. మంగళవారం మండలంలోని చామన్‌పెల్లి గ్రామసభలో ఆయన మాట్లాడారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు కంది, పెసర, మినుములు, జొన్న, సజ్జలు, వేరుశనగ, సన్ ప్లవర్, నువ్వులు వంటి పంటలు సాగు చేయాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతీరైతు తమ పంటచేలలో ఫాంపాండ్ నిర్మించుకోవాలని సూచించారు. ఆయిల్ పాం సాగుతో వచ్చే లాభాలు రైతులకు వివరించారు. ఈ సందర్భంగా 11 మంది రైతులు 27 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని పీఏసీఎస్, గ్రోమోర్ ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.నాగరాజు, వ్యవసాయ విస్తరణ అధికారి వి.పవిత్ర, సర్పంచ్ అయిట్ల లక్ష్మి సుదర్శన్, ఉప సర్పంచ్ గంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.


