మహిళా రిజర్వేషన్లు అమలుపర్చాలి | - | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్లు అమలుపర్చాలి

Jul 22 2026 10:59 AM | Updated on Jul 22 2026 10:59 AM

నిర్మల్‌: కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలుపాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో మంగళవారం జాతీయ అధ్యక్షురాలు అల్కాలాంబ అధ్యక్షతన నిర్వహించిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందు నుంచీ మహిళల పక్షాన నిలుస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఓట్‌ చోరీ, సీట్‌ చోరీ చేసిన బీజేపీ ప్రభుత్వం మహిళ రిజర్వేషన్లనూ చోరీ చేయవద్దన్నారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నేరేళ్ల శారద, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement