భైంసా: భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ జలసిరి పథకాన్ని కలెక్టర్ భవేశ్ మిశ్రా, డీఆర్డీవో విజయలక్ష్మి శనివారం ప్రారంభించారు. జిల్లాలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే దిశగా అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పథకం కింద మూడు రకాల రీచార్జి నిర్మాణాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతలు, ప్రతీ ఊరికి ఊట కుంటలు, ప్రతీ పంటకు నీటి కుంటలు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచేలా చర్యలు చేపడతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణతోపాటు రైతులకు సాగునీటి లభ్యత మెరుగుపడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలో అన్ని గ్రామపంచాయతీల పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
మండలాలు 18
గ్రామపంచాయతీలు (జీపీలు) 400
ఫాంపాండ్లు 2,000
పీటీ పనులు 400
వ్యక్తిగత సోక్‌పిట్లు 70 వేలు
కమ్యూనిటీ సోక్‌పిట్లు 400
బోర్‌వెల్ రీచార్జి 400
ఓపెన్‌వెల్ రీచార్జి 18


