కుస్తీ.. పట్టేదెలా? | - | Sakshi
Sakshi News home page

కుస్తీ.. పట్టేదెలా?

Jul 18 2026 11:57 PM | Updated on Jul 18 2026 11:57 PM

● రెజ్లింగ్‌ మ్యాట్‌, షూ కరువు ● అరకొర వసతుల మధ్య సాధన ● గాయాలపాలవుతున్న క్రీడాకారులు ● రెజ్లింగ్‌ మ్యాట్‌ రూ.5 లక్షల వరకు ఉంది. ఇది 12x12 మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ● కుస్తీలో నైపుణ్యం సాధించాలంటే కై ్లమ్బింగ్‌ రోప్స్‌ ఉపయోగపడతాయి. క్రీడాకారుల అ వసరాలకు అనుగుణంగా ఓ 4రోప్స్‌ అవసరం. ● నిరంతర సాధనకు నాలుగు రెజ్లింగ్‌ డమ్మీలు ఉపయుక్తంగా ఉంటాయి. ఇవి ఏర్పా టు చేస్తే చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాలు వెలికితీయవచ్చు. ● రెజ్లింగ్‌ హాల్‌ చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. సరైన గాలి వెలు తురు వచ్చేలా ఏర్పాటు చేయాలి.

సమకూర్చాల్సినవి..

ఆదిలాబాద్‌: కుస్తీ క్రీడాకారులకు ఆదిలోనే సమస్యలు పలుకరిస్తున్నాయి. అరకొర వసతులు, మ్యాట్‌, షూ లేకుండానే జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాల విద్యార్థులు అసౌకర్యాల మధ్య సాధన చేయాల్సి వస్తోంది. ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో వినియోగంలో లేని రెజ్లింగ్‌ హాల్‌ కేటాయించారు. వర్షం కురిస్తే మ్యాట్‌ వరకు నీరు రావడం, పైనుంచి ఊరుస్తోంది. కుస్తీపై ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించలేపోతున్నారు.

మ్యాట్‌ లేకపాయే..

కుస్తీ సాధనకు రెజ్లింగ్‌ మ్యాట్‌ తప్పనిసరి. మ్యాట్‌ ఉపరితలంపై సాధన చేయడం వల్ల బ్యాలెన్స్‌, వేగవంతమైన కదలికలు, క్రీడా సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలన్నీ మ్యాట్‌పై నిర్వహిస్తుండడంతో క్రీడాకారులు అదే తరహా ఉపరితలంపై శిక్షణ పొందడం అవసరం. ప్రస్తుతం మ్యాట్‌ లేకపోవడంతో క్రీడా పాఠశాల విద్యార్థులకు శిక్షకుడు ఫోమ్‌ ఏర్పాటు చేసి దానిపై కవర్‌ పర్చి సాధన చేయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు గాయాలపాలవుతుండగా, ఈ కారణంగా రాష్ట్ర, జాతీయస్థాయి పతకాల వేటలో వెనుకబడుతున్నారు.

కిట్లు కొంటున్నారు

కుస్తీ క్రీడాకారులు ధరించే ప్రత్యేక దుస్తులను ‘రెజ్లింగ్‌ సింగ్లెట్‌’అని పిలుస్తారు. శరీర కదలికలు స్పష్టంగా కనిపించేలా వీటిని రూపొందిస్తారు. నాణ్యతను బట్టి వీటి ధర సుమారు రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు ఉంటుంది. ప్రత్యేకంగా తయారు చేసిన షూస్‌ మ్యాట్‌పై జారకుండా ఉండేలా డిజైన్‌ చేస్తారు. క్రీడా పాఠశాల నుంచి ఈ కిట్లు అందకపోవడంతో తల్లిదండ్రులు సొంత ఖర్చులతో కొనుగోలు చేసి ఇస్తున్నారు.

త్వరలో అందుబాటులోకి..

కుస్తీ క్రీడాకారులకు అవసరమైన రెజ్లింగ్‌ మ్యాట్‌కు ప్రతిపాదనలు పంపించాం. అనుమతి సైతం లభించింది. నెలల్లోపు మ్యాట్‌ అందుబాటులోకి తీసుకువస్తాం. విద్యార్థులకు అవసరమైన కిట్లు అందిస్తాం. క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.

– దయానందరెడ్డి, డీవైఎస్‌వో, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement