రెండు ఆర్టీసీ బస్సులు ఢీ | - | Sakshi
Sakshi News home page

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

Jul 18 2026 11:57 PM | Updated on Jul 18 2026 11:57 PM

● వెనుక నుంచి ఢీకొట్టిన కారు ● ప్రమాదానికి గురైన మూడు వాహనాలు ● బాదనకుర్తి సమీపంలో ఘటన

ఖానాపూర్‌: రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మండలంలోని బాదనకుర్తి సమీపంలోని గోదావరి వంతెనపై శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి కారు ఓ బస్సును ఢీకొట్టడంతో మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. బస్సుడ్రైవర్‌ మురళితోపాటు ప్రయాణికురాలు ఎల్లమ్మ, మరికొందరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్‌ నుంచి జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, మెట్‌పల్లి నుంచి ఖానాపూర్‌కు వస్తున్న మరో బస్సు గోదావరి వంతెనపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒక బస్సు ముందు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. కొందరు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు క్షతగాత్రులను ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గోదావరి వంతెనపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులకు పక్కకు తొలగించడంతో రాకపోకలు పునరుద్ధరించారు. ప్రమాద ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement