నస్పూర్: సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్, నార్కోటిక్, పోలీసు బృందాలు శనివారం ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నాయి. ఉమామహేశ్వర కాలనీలో కొందరు రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారని సమాచారం అందిందినట్లు సీసీసీ నస్పూర్ ఎస్సై ప్రశాంత్ తెలిపారు. వెంటనే సిబ్బందితో అక్కడికి చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. పట్టుకున్న బియ్యం సుమారు 30 క్వింటాళ్లు, రూ.1.35 లక్షల ఉంటుందని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ ఎస్సై డి.రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
జన్నారం: ఇందన్‌పల్లి శివారు ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద శనివారం తనిఖీల్లో రేషన్ బియ్యం తరలి స్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు. 11.26 క్వింటాళ్ల బియ్యం బస్తాలు ఉన్నాయని, వీటి విలువ సు మారు రూ.40 వేలు ఉంటుందని పేర్కొన్నారు. బియ్యం తరలిస్తున్న ఖా నాపూర్ మండలం సూర్జాపూర్‌కు చెందిన కడమంచి లచ్చన్న, డ్రైవర్ మోర్తాడ్ అరవింద్‌ను విచారించగా ఆర్థికఅవసరాల నిమిత్తం జన్నారం చుట్టుపక్కల గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా లక్ష్మ ణచాంద మండలం వడ్యాల్‌కు చెందిన నరేశ్‌కు వీటిని విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ పనుల కోసం ఎవరైన వీల్స్‌తో ట్రాక్టర్లను రోడ్డుపై నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.


