ఖానాపూర్: సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ నెల 12న నిర్వహించిన అస్మిత ఖేలో ఇండియా మహిళల రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఖానాపూర్ మండలం మస్కాపూర్ జెడ్పీఎస్‌ఎస్ హైస్కూల్ విద్యార్థిని రాగం విజ్ఞత విశేష ప్రతిభ కనబర్చి ప్రత్యేక ప్రతిభా పురస్కారం అందుకుంది. విజ్ఞత సాధించిన విజ యాన్ని పురస్కరించుకుని ఖానాపూర్ కేబుల్ టీవీ ఆపరేటర్ల యూనియన్ సభ్యులు శుక్రవా రం అభినందించారు. చిన్ననాటి నుంచే కుమార్తెకు క్రీడలపై ఆసక్తి పెంపొందించి, ప్రతీ పోటీలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న తండ్రి రాగం గణేశ్‌ను అభినందించారు. విజ్ఞత భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి ఖానాపూర్‌తోపాటు తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కేబుల్ టీవీ ఆపరేటర్ల యూనియన్ ప్రతినిధులు ముజిగెల రవికిరణ్(ఎంఎస్‌వో), కందాల నాగరాజు, బూసి నరేందర్, కందాల చక్రి, సాయి పాల్గొన్నారు.


