కుంటాల: మండలంలోని లింబా(కె) గ్రామంలో గురువారం జరగాల్సిన బాల్య వివాహా న్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలికను నిజామాబాద్ పట్టణంలోని గౌతమ్‌నగర్‌కు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. గ్రామంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించా రు. దీంతో అధికారులు గ్రామానికి చేరుకుని వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. తమ అమ్మాయికి 18 ఏళ్లు నిండే వరకూ వివాహం చేయమని లిఖిత పూర్వకంగా హామీ తీసుకున్నారు. బా ల్య వివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి మురళి, సర్పంచ్ సుంకరోళ్ల గీత, ఎస్సై సిరివేని అశోక్, ఆర్‌ఐ అడెల్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్ శ్రీజని, కౌ న్సిలర్లు శైలజ, కరుణశ్రీ, హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.


