కడెం: కడెం ప్రాజెక్ట్ కుడి కాలువలోని సిల్ట్ తొలగించాలని మండలంలోని చిట్యాల్ గ్రామ రైతులు బుధవారం జిల్లా కేంద్రంలో ఇరిగేషన్ ఎస్ ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడు తూ.. కడెం నుంచి పెద్దబెల్లాల్ వరకు కాలువ పూడికతో నిండగా సాగునీరు చివరి ఆయకట్టుకు వరకు సక్రమంగా అందడం లేదని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. సర్పంచ్ చీమల భీమేశ్, ఉపసర్పంచ్ భగవంత్‌రావుతోపాటు రైతులు ధర్మాజీ రమేశ్, నిమ్మల నరేందర్, బత్తుల నర్సయ్య తదితరులున్నారు.


