సీజనల్‌ వ్యాధులను అరికడతాం | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులను అరికడతాం

Jul 16 2026 5:42 AM | Updated on Jul 16 2026 5:42 AM

● వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశాం ● మందులు అందుబాటులో ఉంచాం ● శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం ● జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రాజేందర్‌

వ్యాధులు వ్యాపించే సీజన్‌

వానాకాలంలో దోమలు, ఈగల ప్రభావం ఎ క్కువగా ఉంటుంది. తాగునీరు కలుషితమవుతుంది. వర్షాల కారణంగా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయి. దీంతో మలేరియా, మెదడువాపు, పైలేరియా, చికున్‌గున్యా, డెంగీ, డ యేరియా, కలరా, టైఫాయిడ్‌, స్వైన్‌ఫ్లూతోపా టు వివిధ రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. వాటిని అధిగమించడానికి వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో డ్రెయినేజీలను శుభ్రం చే యడం, మురుగునీటి గుంటల్లో మట్టి పోయించడం లాంటి పనులకు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, మున్సిపల్‌ సిబ్బంది, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటాం. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయిస్తాం.

ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాల ఏర్పాటు

ఇంటిగ్రేటెడ్‌ డిసీస్‌ సర్వైలైన్స్‌ ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్‌ రె స్పాన్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాల్లో ఫిజీషియన్‌, పిడియాట్రిక్‌ పాటు మరో ఇద్దరు వైద్యులు, ఏఎన్‌ఎం, ఎల్డీలు, ఆశ కార్యకర్తలు ఉంటారు. జిల్లాలో ఎక్కడైనా సీజనల్‌ వ్యాధులు ప్రబలితే ఈ బృందం వెంటనే అక్కడికి చేరుకుని వైద్యసేవలు అందిస్తుంది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులు, సిబ్బందిని స్థానికంగా ఉండాలని ఇప్పటికే ఆదేశించాం. స్థానికంగా ఉండని వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. పీహెచ్‌సీల వారీగా రోజూ నివేదికలు తెప్పించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.

రాజేందర్‌, డీఎంహెచ్‌వో

పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి

వానాకాలంలో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పరిసరాల్లో నీటి గుంటలు ఉంటే వాటిలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినాలి. తాగునీటి ట్యాంకుల్లో క్లోరిన్‌ బిల్లలు వేసుకోవాలి. ఆరోగ్య సమస్యలుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.

క్షేత్రస్థాయిలో అవగాహన

సీజనల్‌ వ్యాధులపై గ్రామాలు, పట్టణాల్లో మా సబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించి నీటి తొట్లు, నీళ్ల ట్యాంకుల్లో నిల్వ నీటిని తొలగించేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇంటింటా స ర్వే నిర్వహిస్తాం. ఎవరైనా జ్వరం లేదా ఇ తర వ్యాధులతో బాధపడితే గుర్తించి అవసరమైన మందులిస్తాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంట ర్లు, పల్లె, బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం.

‘వానాకాలంలో ప్రబలే సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాం. వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం’ అని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజేందర్‌ తెలిపారు. వానాకాలంలో వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి బుధవారం ఆయన ‘సాక్షి’కి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. – నిర్మల్‌చైన్‌గేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement