భైంసా: ముధోల్ మండలంలోని తరోడ గ్రామం ఎ స్‌ఐఆర్ ప్రక్రియలో ఆదర్శంగా నిలిచింది. గ్రామంలోని 221 పోలింగ్ కేంద్రంలో 763 మంది ఓటర్లుండగా వివిధ కారణాలతో 60 మంది పేర్లు తొలగించారు. మిగతా 703 మంది ఓటర్ల వివరాల నమో దు ప్రక్రియ పూర్తయింది. 222 పోలింగ్ కేంద్రంలో 819 మంది ఓటర్లుండగా వివిధ కారణాలతో 76 మంది పేర్లు తొలగించారు. మిగతా 743 మంది ఓ టర్లలో 694 మంది వివరాలు ఇప్పటికే నమోదు చే శారు. మిగతా 47మందిని వ్యక్తిగతంగా సంప్రదించి వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామస్తులకు ముందుగానే అవగాహన కల్పించడంతో వేగంగా వివరాలు అందించారు. సూపర్‌వైజర్ నారాయణరావు పటేల్ మార్గదర్శకత్వంలో సర్పంచ్ ఆరిఫ్ ఉద్దీన్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఆనంద్, బీఎల్వోలు రేష్మా, హర్షియా బేగం సమన్వయంతో పని చేస్తూ ఓటర్ల వివరాల నమోదును త్వరగా పూర్తి చేశారు. రాత్రి 10.30 నుంచి 11గంటల వరకు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం విశేషం.
కలెక్టర్ రాకతో వేగంగా ప్రక్రియ
కలెక్టర్ భవేశ్ మిశ్రా గతంలో తరోడ గ్రామాన్ని సందర్శించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చే యాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ పర్యటన అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు మ రింత చొరవ చూపడంతో ప్రక్రియలో వేగం పుంజుకుంది. సమన్వయంతో పనిచేస్తే తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని చేరుకోవచ్చని తరోడ నిరూపించింది. జిల్లాలో ఇప్పటివరకు 15 గ్రామాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. తరోడ తరహాలో ప్రజాప్రతినిధులు, గ్రామ సిబ్బంది, బీఎల్వోలు సమష్టిగా పనిచేస్తే జిల్లావ్యాప్తంగా ప్రక్రియ త్వరగా పూర్తి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.


