బాసర: బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చై ర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. బుధవారం ఆ యన కళాశాలను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. క్యాంపస్‌లో నిరంతర విద్యుత్, సురక్షిత తా గునీరు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజన సదుపాయాలు కల్పించడంలో రాజీ పడొద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. ఏ విద్యార్థి చదువు మధ్యలో నిలిపివేయకుండా చూడాలని, చదువు పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అడ్మిషన్ల ప్రక్రియ, విద్యాబోధన తీరు గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యా ప్రమాణాల మెరుగుదలకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు. చదువు పూర్తిచేసిన వారికి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్సిటీ అభివృద్ధి, వసతులను చైర్మన్‌కు వివరించారు. కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, కుస్త్రం నీలాదేవి, వీసీ గోవర్ధన్, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ వెంకటరామయ్య, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ అజయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


