భైంసాటౌన్: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో వేగం పెంచాల ని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పులేనగర్‌లో బుధవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన ఫారాల పంపిణీ, స్వీకరించిన ఫారాలు, డిజిటలైజేషన్, తదితర వివరాలు తహసీల్దార్ శశిభూషణ్‌ను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో 51,489 మంది ఓటర్లుండగా, వీరిలో 23,940 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మిగతా ప్రక్రియనూ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. చిరునామా తెలియని ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీకి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని బీఎల్వోలకు తెలిపారు. ప్రక్రియ మొత్తం పారదర్శకంగా పూర్తిచేయాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.


