మెరుగైన సేవలందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలందించడమే లక్ష్యం

Jul 16 2026 5:42 AM | Updated on Jul 16 2026 5:42 AM

తానూరు: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే రామారావ్‌ పటే ల్‌ పేర్కొన్నారు. బుధవారం కోలూరు, జౌలా(బి) లో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్ర భవ నాన్ని ప్రారంభించారు. మండలంలో కాళేశ్వరం 28 ప్యాకేజీ కాలువ పనులు పూర్తికాలేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పనులు పూర్తిచేయించి రైతుల భూములకు సాగునీరు అందేలా కృషిచేస్తామని చెప్పారు. బీటీ రోడ్ల మరమ్మతుకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీడీవో శ్రీధర్‌, సర్పంచులు మాధవ్‌రావ్‌, శివకాంత, ఉపసర్పంచ్‌ అంకుష్‌, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చి న్నరెడ్డి, మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి, నాయకులు శివాజీపటేల్‌, గోపాసాయినాథ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement