న్యూస్‌రీల్
జిల్లాలో 64 శాతం డిజిటలైజేషన్
15 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం..
ఆ ‘మూడు నంబర్లే..’ సర్‌లో కీలకం
‘ఇంటర్వ్యూ’లో కలెక్టర్ భవేశ్‌మిశ్రా
నిర్మల్
రైతులకు నాణ్యమైన విద్యుత్
లోకేశ్వరం: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని టీజీ ఎన్‌పీడీసీఎల్ నిర్మల్ ఎస్‌ఈ జాదవ్ సుభాష్ అన్నారు. మండలంలోని ధర్మోర విద్యుత్ సబ్ స్టేషన్‌లో నూతనంగా బిగించిన 5 ఎంవీఏ పీటీఆర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించాలన్నారు. రైతులకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అటంకం లేకుండా చేస్తామన్నారు. విద్యుత్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు, విద్యుత్ వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మార్టీ, భైంసా డీఈ తిలక్, ఎస్పీం ఏడీఈ రమేశ్, బాసర ఇన్‌చార్జి ఏడీఈ శ్రీని వాస్, లోకేశ్వరం ఏఈ శివకుమార్, లోకేశ్వర్ సబ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఎల్‌ఐ దశరథ్, సాయిబాబా, జెఎల్‌ఎం గంగాధర్ పాల్గొన్నారు.
నమోదు చేసుకుంటేనే బోనస్
సాక్షి : అసలు.. ‘సర్’లో ఓటర్లు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
కలెక్టర్: ఎన్యూమరేషన్ ఫారంలో మూడు అంశాలు చాలా కీలకం. ప్రధానంగా ఈ ఫారంలో 1. శాసనసభ నియోజకవర్గం సంఖ్య, 2. పోలింగ్ కేంద్రం సంఖ్య, 3. ఓటరు జాబితాలో క్రమసంఖ్య. ఈ మూడు తప్పులు లేకుండా చూసుకోవాలి. ఎలాంటి సందేహాలు ఉన్నా బీఎల్‌వో లేదా మండల అధికారులను సంప్రదించాలి. లేదంటే నేరుగా ఫోన్‌లో నన్ను కూడా అడగవచ్చు.
మిగితాచోట్ల ‘ఫారాలు’ పూర్తిచేసివ్వాలి
సాక్షి : జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియ ఏ దశలో ఉంది?
కలెక్టర్: ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఎస్‌ఐఆర్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. సర్ ప్రక్రియ జూన్ 25న ప్రారంభం కాగా, జూలై 6వరకు జిల్లాలోని 925 పోలింగ్ కేంద్రాల పరిధిలో 7,55,344 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశాం. ప్రస్తుతం బీఎల్‌వోలు పూర్తిచేసిన ఫారాలను తీసుకోవడం, డిజిటలైజేషన్(ఆన్‌లైన్) చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
సాక్షి : ఇప్పటి వరకు ఎంతమేర నమోదైంది..?
కలెక్టర్:మంగళవారం సాయంత్రం వరకు పూర్తిచేసి అందిన ఫారాల్లో 64 శాతం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు(డిజిటైజేషన్) చేశాం. మిగిలిన వివరాలను కూడా వేగంగా నమోదు చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లా ఈ అంశంలో టాప్‌టెన్‌లో ఉంది.
సాక్షి : పదిరోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటారా?
కలెక్టర్: అవును. మరో పది రోజుల్లో ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. బీఎల్‌వోలు, పర్యవేక్షక అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారు. రోజుకు 8 శాతం చొప్పున డిజిటైజేషన్ కొనసాగుతోంది. ఈలెక్కన ఈనెల 20లోపే వందశాతం పూర్తి చేద్దామన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.
సాక్షి : ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్లకు ఏం చెబుతారు..?
కలెక్టర్: ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లు వెంటనే తమ బీఎల్‌వోను సంప్రదించి పూర్తి చేసిన ఫారాలను అందజేయాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా సమర్పిస్తే వివరాలను సకాలంలో నమోదు చేయడం సులభమవుతుంది. ఆన్‌లైన్ సర్వర్లకు సంబంధించి ఇబ్బంది ఉండదు.
సాక్షి : ‘సర్’లో అధికారులు ఏమేం పరిశీలిస్తారు..?
కలెక్టర్: ఈ ప్రక్రియలో ఓటర్‌కు సంబంధించిన పూర్తివివరాలు తెలిసిపోతాయి. ఇకపై డబుల్ ఓటుకూ అవకాశం ఉండదు. జిల్లాలో ఇప్పటికే 15 పోలింగ్ కేంద్రాల్లో వందశాతం డిజిటైజేషన్ కూడా పూర్తిచేసి, ఏఎస్‌డీ(అబ్‌సెంట్,షిఫ్టెడ్,డెత్, డబుల్‌ఓట్) పక్కాగా పూర్తిచేశాం.
సాక్షి : ఏఎస్‌డీ అంటే ఏంటి....
కలెక్టర్: సర్ ప్రక్రియ మొత్తం పూర్తయిన పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లు, సంబంధిత గ్రామ పెద్దలంతా కలిసి పూర్తిచేసే జాబితానే ఏఎస్‌డీగా పేర్కొంటారు. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో అబ్‌సెంట్(ఫారాలు ఇవ్వనివారు), ఫిఫ్టెడ్(తరలివెళ్లినవారు), డెత్(చనిపోయినవారు) డబుల్ ఓట్(రెండుచోట్ల ఓట్లు ఉన్నవారు) ఇలా వీరికి సంబంధించి వివరాలన్నీ రాస్తారు. వీటితోపాటు ఓటు ఎందుకు తిరస్కరణకు గురైందనే కారణాన్నీ అందులో నోట్ చేస్తారు.
సాక్షి : ఎస్‌ఐఆర్ వల్ల ఓటర్లకు కలిగే ప్రయోజనం ఏమిటి?
కలెక్టర్: అర్హులైన ప్రతిఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, తప్పులు సరిచేసేలా, మరణించినవారి లేదా అనర్హుల పేర్లను తొలగించేలా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. దీంతో మరింత ఖచ్చితమైన ఓటరు జాబితా సిద్ధమవుతుంది.
సాక్షి : జిల్లావాసులకు మీ సందేశం..?
కలెక్టర్:ఓటు హక్కు ప్రతీ పౌరుడి బాధ్యత. అందువల్ల అర్హుడైన ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో యాక్టివ్ భాగస్వామి కావాలి. ఇంకా ఫారాలు సమర్పించని వారు వెంటనే సమర్పించాలి. పట్టణ ప్రాంత ఓటర్లు వేగం పెంచాలి.
‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియను ప్రతీ ఓటరు సీరియస్‌గా తీసుకోవాలి. మరో పదిరోజుల్లో సర్ ముగియనుంది. ఈనెల 20లోపే జిల్లాలో దాదాపు ప్రక్రియ అంతా పూర్తిచేసే దిశగా వెళ్తున్నాం. ఎన్యూమరేషన్ ఫారాలను త్వరగా నింపి, బీఎల్‌వోలకు అందించాలి. లేనిపక్షంలో ఓటును కోల్పోయే అవకాశం ఉంటుంది..’ అని కలెక్టర్ భవేశ్‌మిశ్రా తెలిపారు. ఎస్‌ఐఆర్‌కు మరో పదిరోజులు మాత్రమే గడువు ఉండటంతో ఈ ప్రక్రియలో పురోగతి, ప్రజల సహకారం, తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... – నిర్మల్
సాక్షి : 2002 ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే ఎలా..?
కలెక్టర్: ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్‌లో 2002లో నిర్వహించిన సర్ ప్రకారమే వివరాలు పొందుపర్చాలి. ఒకవేళ పేర్లు, తండ్రి/తల్లిపేరు, పుట్టినతేదీ, ఫొటోతో పాటు పోలింగ్‌కేంద్రం మార్పులనూ జూలై 31న వచ్చే డ్రాఫ్ట్ తర్వాత చేసుకోవచ్చు. ఇందుకు ఏమేం మార్పులను కోరుకుంటున్నామో వాటి వివరాలను ఫామ్–8లో నింపి ఇవ్వాలి.


