ఖానాపూర్: పదో తరగతిలో 575 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని శ్రీవల్లికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.లక్ష నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రీవల్లి సంస్థకు కృతజ్ఞతలు తెలిపింది. తల్లిదండ్రులు అశ్విని, సాగర్, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొంది. కార్యక్రమంలో ఖానాపూర్ బ్రాంచ్ మేనేజర్ పి.వినోద్ కుమార్, డీవోలు లోకిని రాము, కేసరి రాజేందర్, అనూష, బిజినెస్ డెవలప్‌మెంట్ అధికారి కళ్యాణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


