కుంటాల: ఈ వానాకాలంలో వరి పంటపై ఎల్‌నినో ప్రభావం చూపుతుందని డీఏవో అంజిప్రసాద్ తెలిపారు. మండలంలోని అందకూర్, కుంటాల గ్రామాల్లో వరినారు, సోయా పంటను మంగళవారం పరిశీలించారు. వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతులు పత్తి, సోయా సాగుచేశారన్నారు. జూలై మాసం సగం పూర్తయినా ఆశించిన వర్షాలు లేక పంటలు ఎండు ముఖం పట్టాయని పేర్కొన్నారు. రైతులు పొద్దు తిరుగుడు, నువ్వులు, ఆముదం, కందులు, వేరుశనగ పంటలతోపాటు కూరగాయలను మాత్రమే సాగు చేయాలని సూచించారు. ఆరుతడి పంటలు వేస్తేనే ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ జక్కుల గజేందర్, ఏఈవో హర్షిత, రైతులు ఉన్నారు.


