భూభారతి రీసర్వేను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

భూభారతి రీసర్వేను సద్వినియోగం చేసుకోవాలి

Jul 15 2026 12:05 AM | Updated on Jul 15 2026 12:05 AM

భైంసారూరల్‌: భూభారతి రీసర్వేను సద్వినియోగం చేసుకుని తమ భూముల వివరాలను పారదర్శకంగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ సూచించారు. మండలంలోని ఎగ్గాం గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన బాబుల్‌గాంలో మంగళవారం కొనసాగుతున్న భూభారతి రీసర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణ తీరును పరిశీలించిన అదనపు కలెక్టర్‌ సంబంధిత రెవెన్యూ, సర్వే అధికారులకు సూచనలు చేశారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఆయన రీసర్వేతో కలిగే ప్రయోజనాలను వివరించారు. భూవివాదాల పరిష్కారం, కచ్చితమైన భూ రికార్డుల నమోదు, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలులో ఈ సర్వే కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద భైంసా మండలం బాబుల్‌గాం, లక్ష్మణచాంద మండలం మల్లాపూర్‌, కడెం మండలం బాబాపూర్‌ ఎంపికయ్యాయన్నా రు. ఆయన వెంట తహసీల్దార్‌ శశిభూషణ్‌, సర్వేయర్‌ జవహర్‌సింగ్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement