ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలి

Jul 15 2026 12:05 AM | Updated on Jul 15 2026 12:05 AM

● తపస్‌ జిల్లా శాఖ డిమాండ్‌

నిర్మల్‌ రూరల్‌: ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆ ర్సీ, ఆరు డీఏ బకాయిలను ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని తపస్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు శశిరాజ్‌ మాట్లాడు తూ.. పీఆర్సీ రిపోర్టును ముఖ్యమంత్రి వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్మెంట్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక నష్టం జరుగుతున్నందున ప్రజాసంక్షేమంపై దృష్టి పెడుతున్న ముఖ్యమంత్రి ఆ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందజేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సీపీఎస్‌ రద్దుచేసి వోపీఎస్‌ అమలు చేయాలన్నారు. కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులు, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌, రాజేశ్వర్‌, రామ్‌నరేశ్‌, చంద్రప్రకాశ్‌, శ్రీనివాస్‌, సాయన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement