ఆరుతడి పంటలు వేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు వేసుకోవాలి

Jul 15 2026 12:05 AM | Updated on Jul 15 2026 12:05 AM

లక్ష్మణచాంద: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని తెలంగాణ వ్యవసాయ విద్యాలయం శాస్త్రవేత్త రాహుల్‌ విశ్వకర్మ సూచించారు. సోన్‌ మండలం జాఫ్రాపూర్‌ గ్రామంలో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పప్పు దినుసులు, చిరు ధాన్యాలు, నునె గింజల పంటలు సాగు చేయాలని తెలిపారు. నీటి సంరక్షణ, నేలలో తేమ పరిరక్షణ, పంటల వైవిధ్యీకరణ, శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతుల ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు. రైతులు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. తక్కువ నీటితో సాగుచేయగల పంటలను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ రాజురెడ్డి, ఏవో వినోద్‌, ఏఈవో సంధ్య, ఉప సర్పంచ్‌ మధుకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement