‘శారీరక అంగవైకల్యంతో కొన్నేళ్లుగా మంచానికే అంకితమై బాధపడుతున్నం. ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మాకు న్యాయం చేయడంలేదు’ అని ఈ యువ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మా వైకల్యం కనిపించడం లేదా.. పింఛన్‌కు మేం అర్హులం కాదా అని’ అని ప్రశ్నిస్తున్నారు. పింఛన్ కోసం ప్రజావాణిలో ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలని వేడుకున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్


