న్యూస్‌రీల్
8 రకాల వరి వంగడాల పేర్లతో వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం వానాకాలం సాగు ప్రమోషన్ పేరిట కరపత్రాల ముద్రణ కొన్ని రకాలనే సూచించడంతో రైతుల్లో అయోమయం
నిర్మల్
‘బడి’బాట సాగేదెట్లా..!
సర్కారు బడుల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ఏటా నిర్వహించే బడిబాట కార్యక్రమం–అమలు ప్రణాళిక(2026–27)పై ఈసారి సందిగ్ధత నెలకొంది.
కుటుంబ ప్రయోజనం.. ఇక సులభం
ఎప్‌సెట్‌లో ప్రతిభ
భైంసాటౌన్: తెలంగాణ ఈఏపీ సెట్–2026 ఫలితా ల్లో భైంసా పట్టణానికి చెందిన పల్సి సూర్యతేజ 164 ర్యాంకు సాధించాడు. ఇంజినీరింగ్ విభాగంలో 160 మార్కులకు 113.65 మార్కులు సాధించాడు. ఇదివరకే జేఈఈ మెయిన్స్‌లో ఓబీసీ విభాగంలో 279 ర్యాంకు సాధించాడు.
లోకేశ్వరం విద్యార్థులు..
లోకేశ్వరం: మండల కేంద్రానికి చెందిన మెండే సంధ్య–వెంకటరమణ దంపతుల కుమారుడు సాయిచైతన్య, మండలంలోని భాగాపూర్‌కు చెందిన హర్ష నవ్యశ్రీ ఎప్‌సెట్‌లో సత్తా చాటారు. సాయిచైతన్య 96.6 మార్కులతో 397 ర్యాంకు, హర్ష నవ్యశ్రీ 89.12 మార్కులతో 916 ర్యాంకు సాధించారు.
లక్ష్మణచాంద..
లక్ష్మణచాంద: ఎప్‌సెట్ ఫ లితాల్లో మండల విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబర్చా డు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన ఓస మంజుల–రాజేశ్వర్ దంపతుల చిన్న కుమారుడు రాజ్‌కుమార్ 90.53 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 764 ర్యాంక్ సాధించారు. దీంతో విద్యార్థికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మల్‌చైన్‌గేట్: వానాకాలంలో సాగు చేసే సన్న రకాల వరిలో తాము సూచించే ఎనిమిది రకాలనే సాగు చేయండి.. బోనస్ పొందండి అంటూ వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం చేపట్టింది. సన్నాలలో ఎన్నో రకాలు ఉండగా కేవలం 8 రకాలనే ప్రమోషన్ చేస్తూ ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. సన్న రకాలను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తున్న విషయం విదితమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వానా కాలం సీజన్‌లో కొనుగోలు చేసిన సన్న రకాలకు బోనస్ ఇస్తోంది. మొదట్లో సన్నాల్లో ఏ రకం సాగు చేసినా బోనస్ అందించింది.
ఈ సీజన్ నుంచి 8 రకాలకే..
2026 వానా కాలం సీజన్‌కు సంబంధించి 8 రకాలనే ప్రమోషన్ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. సన్నాలలో ఎన్నో రకాలు ఉండగా రోగాల బారిన పడని, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చేవి, కలుపు ఇబ్బందులు లేని రకాలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సూచించిన రకాలలో కొన్నింటికి దిగుబడి ఆశించినంతగా రాదని రైతులు చెబుతున్నారు. అలాగే తెగుళ్లు ఎక్కువగా సోకే రకాలు ఉన్నాయని తెలిపారు. ప్రమోషన్ చేయాలని సూచించిన 8 రకాల కంటే ఎంతో నాణ్యమైన విత్తనాలు మార్కెట్‌లో ఉన్నాయని వెల్లడిస్తున్నారు. సన్న రకాలకు బోనస్ అనే హామీకి ప్రభుత్వం కట్టుబడిఉండాలని అంతేకానీ తాము సూచించిన 8 రకాలకే బోనస్ వర్తిస్తుందనే ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వానాకాలం సాగుకు అవసరమైన వరి విత్తనం సేకరణలో బిజీగా ఉన్న రైతులకు వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రచారం తలనొప్పిగా మారింది. బొనస్ ఎగ్గొట్టే ఎత్తుగడలో భాగమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మెండే సాయిచైతన్య
హర్ష నవ్యశ్రీ
అన్ని రకాలకు బోనస్ ఇవ్వాలి..
అన్ని రకాల సన్నాలకు బోనస్ వర్తింపజేయా లి. ప్రభుత్వం కొన్ని రకాలకే బోనస్ ఇస్తామని చెప్పడం సరికాదు. రైతులు తమకు అందుబా టులో ఉన్న సన్న రకాల విత్తనాలనే కొనుగోలు చేస్తారు. ఎన్నో రకాలు మార్కెట్‌లో అందుబా టులో ఉన్నాయి. కొన్నింటినే ప్రమోషన్ చేయ డం ఎందుకు.
– సాయన్న, రైతు, కుంటాల
వ్యవసాయ శాఖ సూచించిన వరి రకాలు
రకం పంట కాలం
(రోజుల్లో)
బీపీటీ 5204(సోనామసూరి) 140–150
తెలంగాణ సోన
(ఆర్‌ఎస్‌ఆర్ 15048) 120–125
కేఎన్‌ఎం–1638 120–125
జైశ్రీరాం 130–135
హెచ్‌ఎంటీ(సోనా) 135–145
డబ్ల్యూజీఎల్–962 125–130
డబ్ల్యూజీఎల్–44(సిద్ది) 140–145
జేజీఎల్ 1798 120–125


