నిర్మల్ రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి పాలనలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, దేశభక్తిని చాటేలా చేసి న ప్రదర్శనలు అలరించాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ సుధాకర్ బహుమతులు అందజేశారు. ఇటీవల నిర్వహించిన అథ్లెటిక్స్‌లో రాణించిన క్రీడాకారులను సన్మానించారు. సాంస్కృతిక విభాగం అధిపతులు రంజిత్ కుమార్, రాథోడ్, అధ్యాపకులు సూర్యసాగర్, జాకీర్‌హుస్సేన్, హేమలత, అర్చన, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విజేతలతో ప్రిన్సిపాల్ సుధాకర్, అధ్యాపకులు


