ఘనంగా సుంకు పట్టు వేడుక | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సుంకు పట్టు వేడుక

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

ఖానాపూర్‌: మండలంలోని పాత ఎల్లాపూర్‌ గ్రామంలో కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప కామరాతి కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం సుంకు పట్టు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బోనాల ఊరేగింపు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం బీరప్ప కల్యాణం నిర్వహిస్తామని తెలిపారు. 19న జోగు తిరుగుట, బోనాల ఊరేగింపు, 20న నాగవెల్లి కార్యక్రమం ఉంటాయని పేర్కొన్నారు. 21న గారడి, ఎట్టి ముల్లెలు కార్యక్రమాలు, 22న జిష్టి కుంభం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement