సారంగాపూర్ మండల కేంద్రంలో రైతుల ఆగ్రహం కట్టలు తెగింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు 20 రోజులుగా గన్నీబ్యాగులు లేకపోవడంతో నిరీక్షిస్తున్నారు. అధికారులను అడిగితే రేపు.. మాపు అంటూ దాటవేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం కేంద్రానికి గన్నీ సంచుల లోడ్‌తో లారీ వచ్చింది. గమనించిన రైతులు పది నిమిషాల్లో లారీని ఖాళీ చేశారు. లారీలో ఉన్న గన్నీ సంచులను దొరికినన్ని ఎత్తుకెళ్లారు. రైతుల ఆగ్రహం చూసిన రైతులు సైలెంట్‌గా ఉండిపోయారు. – సారంగపూర్


