అలుగు నిర్మాణానికి భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

అలుగు నిర్మాణానికి భూమిపూజ

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

కుభీర్‌: మండలంలోని హంపోలి చెరువు అలు గు నిర్మాణానికి ఎమ్మెల్యే పవార్‌ రామారావ్‌ ప టేల్‌ ఆదివారం భూమిపూజ చేశారు. ఈ చెరు వు మరమ్మతులకు రూ.40 లక్షలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ గ్రామాల అభివృద్ధికి సంపన్నులు తమవంతు సాయం అందించాలని కోరారు. తాగునీటి సమస్య పరిష్కారానికి సహకరించాలన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో ని యోజకవర్గానికి నిధులు తెస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో 360 చెరువులు ఉండగా 100 చెరువుల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 225 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని తెలి పారు. మండలంలోని పల్సి నుంచి నిగ్వా వర కు రోడ్డు నిర్మాణానికి రూ.7.5 కోట్లు వచ్చాయన్నారు. కార్యక్రమంలో భైంసా మార్కెట్‌ చైర్మన్‌ ఆనంద్‌రావు పటేల్‌, కుభీర్‌ మార్కెట్‌ చైర్మన్‌ కళ్యాణ్‌, మాజీ మండల అధ్యక్షుడు బొయొడి వి ఠల్‌, ఇరిగేషన్‌ ఈఈ అనిల్‌, ఏఈ ఉదయ్‌, హంపోలి సర్పంచ్‌ దత్తురాంపటేల్‌, సొనారి సర్పంచ్‌ నరసింహ, గోడాపార్‌ సర్పంచ్‌ దత్తహరి, మాజీ సర్పంచ్‌ నర్సారెడ్డి, నాయకులు కనకయ్య, వైద్యనాథ్‌, ముత్త్యంరావ్‌, విఠల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement